36 మంది కార్యదర్శులకు తాఖీదులు

గ్రామపంచాయతీల్లో కరెంటు బిల్లులను, ట్రాక్టర్లకు ఈఎంఐలను సకాలంలో, సక్రమంగా చెల్లించడంలేదనే కారణాలతో గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 36 మంది గ్రామ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) కృష్ణ తాఖీదులు జారీ చేశారు.

Published : 30 Sep 2022 04:09 IST

ముందు సస్పెన్షన్‌ ఉత్తర్వులు.. గంటలోనే మార్పు!

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: గ్రామపంచాయతీల్లో కరెంటు బిల్లులను, ట్రాక్టర్లకు ఈఎంఐలను సకాలంలో, సక్రమంగా చెల్లించడంలేదనే కారణాలతో గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 36 మంది గ్రామ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) కృష్ణ తాఖీదులు జారీ చేశారు. వాయిదాలు, బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. అయితే, అంతకుముందు 36 మంది గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత గంటకే.. తాఖీదులకు సంబంధించిన మరో ఉత్తర్వు విడుదలవడం గమనార్హం. కింది స్థాయి సిబ్బంది పొరపాటు వల్ల తప్పుగా ‘సస్పెన్షన్‌’ ఉత్తర్వు వచ్చిందని, గ్రామ కార్యదర్శులకు తాఖీదులు మాత్రమే జారీ చేశామని డీపీవో కృష్ణ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని