భూమి రిజిస్ట్రేషన్‌ వివాదం.. మృతదేహంతో ఆందోళన

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మున్వర్‌ఖాన్‌(65) అనే వ్యక్తి బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే.. కోర్టు కేసులో ఉన్న తన భూమిని

Published : 30 Sep 2022 04:09 IST

సదాశివనగర్‌, న్యూస్‌టుడే: కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మున్వర్‌ఖాన్‌(65) అనే వ్యక్తి బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే.. కోర్టు కేసులో ఉన్న తన భూమిని తహసీల్దార్‌ మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేశారన్న మనస్తాపంతోనే మున్వర్‌ఖాన్‌ మృతిచెందాడంటూ ఆయన బంధువులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. డబ్బులు తీసుకొని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపించారు. ఆ సమయంలో తహసీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో ఉప తహసీల్దార్‌ సాయిలును నిలదీశారు. 16 ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమిని మరో వ్యక్తికి ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారని ప్రశ్నించారు. ఏఎస్సై నర్సయ్య అక్కడికి చేరుకుని.. చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. తహసీల్దార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ధరణిలో పట్టా ఉన్న వ్యక్తి భూమిని ఇతరులకు విక్రయించారని, మున్వర్‌ఖాన్‌ వేసిన కేసును కోర్టు కొట్టేసిందని తెలిపారు. నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్‌ చేశానని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని