సీఎం కేసీఆర్‌తో లోక్‌మత్‌ మీడియా సంస్థల అధిపతి విజయ్‌ దర్డా భేటీ

లోక్‌మత్‌ మీడియా సంస్థల ఛైర్మన్‌, మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ విజయ్‌ దర్డా గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జాతీయ అంశాలు, తెలంగాణ అభివృద్ధి తదితర విషయాలపై దాదాపు మూడు గంటలపాటు చర్చించారు.

Published : 30 Sep 2022 04:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌మత్‌ మీడియా సంస్థల ఛైర్మన్‌, మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ విజయ్‌ దర్డా గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జాతీయ అంశాలు, తెలంగాణ అభివృద్ధి తదితర విషయాలపై దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్‌ అందిస్తున్న సుపరిపాలన అభినందనీయం. ఇంతటి పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్ఞత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ నుంచి ఎదగడం దేశానికి శుభసూచకం’’ అని పేర్కొన్నారు. విజయ్‌కు సీఎం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా విజయ్‌ దర్డా తాను రచించిన ‘రింగ్‌సైడ్‌’ పుస్తకాన్ని సీఎంకు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని