‘సికింద్రాబాద్‌’ విధ్వంసంపై ఫోరెన్సిక్‌ విశ్లేషణ పూర్తి

సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం ఘటనలో దర్యాప్తు తుది దశకు చేరింది. పెండింగ్‌లో ఉన్న ఫోరెన్సిక్‌ నివేదిక కూడా సిద్ధమవడంతో త్వరలోనే అభియోగపత్రాలు(ఛార్జిషీట్లు)

Updated : 30 Sep 2022 05:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం ఘటనలో దర్యాప్తు తుది దశకు చేరింది. పెండింగ్‌లో ఉన్న ఫోరెన్సిక్‌ నివేదిక కూడా సిద్ధమవడంతో త్వరలోనే అభియోగపత్రాలు(ఛార్జిషీట్లు) దాఖలు చేసేందుకు రైల్వే పోలీసులు సిద్ధమవుతున్నారు. సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌ 17న చేపట్టిన ఆందోళన పెను విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అగ్నిపథ్‌ వస్తే తమకు తీరని నష్టం వాటిల్లుతుందని కొన్ని సైనిక ఉద్యోగ శిక్షణ కేంద్రాల నిర్వాహకులు రెచ్చగొట్టడమే ఆందోళనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావును సైతం అరెస్టు చేశారు. వాట్సప్‌ గ్రూపులతో ఏకమైన నిరుద్యోగ యువకులను కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు విధ్వంసం దిశగా ప్రేరేపించారని అభియోగం. దీంతో ఈ కేసులో కీలకమైన వాట్సప్‌ సంభాషణలను విశ్లేషించేందుకు నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్‌ నివేదిక సిద్ధమవడంతో అభియోగపత్రాలు దాఖలు చేయడమే మిగిలింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని