హోంమంత్రికి అర్ధరాత్రి పౌరుడి ఫోన్‌

రాజధాని నగరంలో హోటళ్లను రాత్రి ఒంటిగంట వరకు అనుమతించవద్దంటూ నగరవాసి ఒకరు రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీకి అర్ధరాత్రి వేళ ఫోన్‌ చేశారు. వీరిద్దరి సంభాషణ

Published : 30 Sep 2022 07:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని నగరంలో హోటళ్లను రాత్రి ఒంటిగంట వరకు అనుమతించవద్దంటూ నగరవాసి ఒకరు రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీకి అర్ధరాత్రి వేళ ఫోన్‌ చేశారు. వీరిద్దరి సంభాషణ ఆడియోను కొన్ని టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. నగరంలో హోటళ్ల సమయాన్ని అర్ధరాత్రి దాటేవరకు పొడిగిస్తారన్న సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందని.. అలా చేయవద్దంటూ ఆ పౌరుడు హోంమంత్రికి సుదీర్ఘంగా వివరించబోయారు. రాత్రి 11లోపే హోటళ్లు, బిర్యానీ దుకాణాలు మూసివేయించాలని కోరాడు. దాంతో మంత్రి ఏకీభవిస్తూనే.. ఎన్నో ఒత్తిళ్ల మధ్య గడిపే తనకు.. నిద్రపోయే సమయంలో ఫోన్‌ చేయడం సరికాదని అతడికి నచ్చజెప్పారు. ఏదైనా చట్టప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని