తీరొక్క పూల రూపం.. తల్లీబిడ్డలు అపురూపం!

బతుకమ్మ.. తెలంగాణ ఆడపడచులు తీరొక్క పూలను పేర్చి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచే వేడుక. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా వాడవాడన తల్లీబిడ్డలు, అక్కాచెల్లెళ్లు ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు. ఆ

Published : 30 Sep 2022 05:33 IST

బతుకమ్మ.. తెలంగాణ ఆడపడచులు తీరొక్క పూలను పేర్చి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచే వేడుక. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా వాడవాడన తల్లీబిడ్డలు, అక్కాచెల్లెళ్లు ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు. ఆ పూల పండుగ రోజున కొలువుదీర్చేందుకు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన సముద్రాల ప్రభాకర్‌ అనే కళాకారుడు బతుకమ్మలతో తల్లీబిడ్డలు ఉన్న విగ్రహాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను తలపై పెట్టుకున్న తల్లి, తన చెంతనే ఉన్న బిడ్డ రూపంతో తయారైన అపురూప ఫైబర్‌ విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

- న్యూస్‌టుడే, గంగాధర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని