ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా..

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రతి కట్టడాన్నీ ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొండపైన దర్శన వరుసల సముదాయం, కొండ కింద లక్ష్మీ

Published : 30 Sep 2022 05:33 IST

యాదాద్రిలో కమాండ్‌ కంట్రోల్‌, బస్‌బే నిర్మాణాలు!

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రతి కట్టడాన్నీ ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొండపైన దర్శన వరుసల సముదాయం, కొండ కింద లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట తదితరాలకు రూపమిచ్చారు. అదే బాటలో ప్రస్తుతం కొండపైన బస్‌ బే, కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. భక్తుల భద్రతపై దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రూ.4.25కోట్ల వ్యయంతో కమాండ్‌ కంట్రోల్‌ పేరిట ప్రత్యేక భవనం నిర్మిస్తోంది. ప్రధానాలయ పరిసరాలు, కొండ కింద వసతుల సముదాయాల్లో అమర్చే 170 సీసీ కెమెరాలను ఈ భవనం నుంచి పోలీసులు పర్యవేక్షించనున్నారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ను రాష్ట్ర రాజధానిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి అనుసంధానించనున్నారు. తద్వారా క్షేత్ర పరిసరాల్లో నిఘాను హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది.

* వివిధ ప్రాంతాల నుంచి క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తుల రవాణా సౌలభ్యం కోసం ప్రధానాలయానికి ఉత్తర దిశలో 16 ప్లాట్‌ఫారాలతో బస్‌ బే నిర్మిస్తున్నారు. దీనికి వెనుకవైపు(ఉత్తర దిశలో) ఆలయ సంస్కృతిని ప్రతిబింబించేలా రూ.2.5 కోట్లతో మందిర రూప నిర్మాణాలను చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని