మూడు పట్టణాలకు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ అవార్డులు

మెరుగైన పారిశుద్ధ్యం పాటిస్తున్న పట్టణాలు/నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ అవార్డులను అందజేసింది. తెలంగాణలో చెత్తరహిత నగరాలుగా (గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌) పీర్జాదీగూడ నగర పాలక సంస్థ, కోరుట్ల, అలంపూర్‌ పురపాలక సంఘాలు ఎంపికయ్యాయి.

Published : 01 Oct 2022 04:35 IST

ఈనాడు, దిల్లీ: మెరుగైన పారిశుద్ధ్యం పాటిస్తున్న పట్టణాలు/నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ అవార్డులను అందజేసింది. తెలంగాణలో చెత్తరహిత నగరాలుగా (గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌) పీర్జాదీగూడ నగర పాలక సంస్థ, కోరుట్ల, అలంపూర్‌ పురపాలక సంఘాలు ఎంపికయ్యాయి. దిల్లీలోని తల్కటోరా స్టేడియంలో శుక్రవారం కేంద్ర గృహ,పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, పీర్జాదీగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ రామకృష్ణ, కోరుట్ల పురపాలక కమిషనర్‌ అయాజ్‌, అలంపూర్‌ పురపాలక కమిషనర్‌ నిత్యానంద్‌ అవార్డులు స్వీకరించారు. 15 వేలలోపు జనాభా పట్టణాల కేటగిరీలో అలంపూర్‌, 25 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో పీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని