తృణ ధాన్యాల ప్రయోజనాలను వివరించాలి: తమిళిసై

తృణ ధాన్యాలతో ఒనగూరే లాభాలను రైతులకు, ప్రజలకు తెలియజేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలకు సూచించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌), కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో 3 రోజుల పాటు జరిగే వ్యవసాయ వర్సిటీ వీసీల సమావేశాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు.

Published : 01 Oct 2022 04:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: తృణ ధాన్యాలతో ఒనగూరే లాభాలను రైతులకు, ప్రజలకు తెలియజేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలకు సూచించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌), కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో 3 రోజుల పాటు జరిగే వ్యవసాయ వర్సిటీ వీసీల సమావేశాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు. తక్కువ నీరు, యాజమాన్య ఖర్చులతో వీటిని సాగు చేయవచ్చని చెప్పారు.  కార్యక్రమంలో ఐసీఏఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఆర్‌.సి.అగర్వాల్‌, ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ బి.నీరజాప్రభాకర్‌, 46 వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని