ఆహార కల్తీపై కఠినచర్యలు

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని, దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణకోశ సమస్యలతో పాటు క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Published : 01 Oct 2022 04:35 IST

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని, దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణకోశ సమస్యలతో పాటు క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, పదార్థాల్లో నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే.. ప్రజలు 040 21111111 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని, జీతినీదిబిబీలీది ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఆహార పరిరక్షణ విభాగం పురోగతి, లక్ష్యాలపై వెంగళరావునగర్‌లోని భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలో మంత్రి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆహార పరిరక్షణ విషయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి. అధికారులు లేనిచోట జిల్లా వైద్యాధికారులకు ఆహార పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలి. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా త్వరలో ఖాళీలు భర్తీ చేస్తాం. నెలలో రెండు శనివారాల్లో అనుమతి పత్రాల జారీకి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి. కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలి. నిఘా బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి’ అని మంత్రి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని