జీవితంలో కళల పాత్ర కీలకం

ప్రతి వ్యక్తి జీవితంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కళోత్సవాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే ఈ వేడుకల్లో 19 రాష్ట్రాల కళాకారులు పాల్గొంటున్నారు.

Published : 01 Oct 2022 05:53 IST

కరీంనగర్‌ కళోత్సవాల్లో స్పీకర్‌ పోచారం

ఈనాడు, కరీంనగర్‌: ప్రతి వ్యక్తి జీవితంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కళోత్సవాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే ఈ వేడుకల్లో 19 రాష్ట్రాల కళాకారులు పాల్గొంటున్నారు. వీటిని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్‌ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కళలకున్న ప్రాధాన్యం ఎనలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆటాపాటా ఆకట్టుకున్నాయని తెలిపారు. కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తుందన్నారు. సినీ నటుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కళాకారుల అడ్డా అని అభివర్ణించారు. సాటి కళాకారులను ప్రోత్సహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని మరో నటుడు తరుణ్‌ అన్నారు. శక్తి ఉన్నంతవరకు తాను కళారంగం అభివృద్ధికి కృషిచేస్తానని మంత్రి గంగుల అన్నారు. తారా ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా ఇజ్రాయెల్‌, అస్సాం, పంజాబీ కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ బుల్లెట్‌ భాస్కర్‌ బృందం హాస్యంతో ఆకట్టుకోగా.. సినీ గాయని మధుప్రియ జానపద గీతాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. అక్టోబరు 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని