వ్యవసాయానికి రూ.19 వేల కోట్ల రుణాలు

రాష్ట్రంలో మొదటి త్రైమాసికంలో వ్యవసాయానికి రూ.19 వేల కోట్ల రుణాలను ఇచ్చినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) వెల్లడించింది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జూన్‌ నెలాఖరు వరకు రూ.9,777 కోట్ల పంట రుణాలు, రూ.9407 కోట్ల వ్యవసాయ పెట్టుబడి రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను అందజేసినట్లు తెలిపింది.

Published : 01 Oct 2022 05:53 IST

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొదటి త్రైమాసికంలో వ్యవసాయానికి రూ.19 వేల కోట్ల రుణాలను ఇచ్చినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) వెల్లడించింది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జూన్‌ నెలాఖరు వరకు రూ.9,777 కోట్ల పంట రుణాలు, రూ.9407 కోట్ల వ్యవసాయ పెట్టుబడి రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను అందజేసినట్లు తెలిపింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ఈ ఏడాది రూ.617 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌, ఎస్‌ఎల్‌బీసీ ఛైర్మన్‌, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌, ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ నిఖిల, నాబార్డు సీజీఎం చింతల సుశీల, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ దేబాశిష్‌ మిశ్రా సహా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొదటి త్రైమాసికం వరకు రుణాలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఎస్‌ఎల్‌బీసీ ఛైర్మన్‌ మాట్లాడుతూ మొదటి త్రైమాసికంలో తెలంగాణలో బ్యాంకు డిపాజిట్లు రూ.2073 కోట్ల మేర తగ్గి రూ.6.30 లక్షల కోట్లుగా ఉందన్నారు. రుణాలు కూడా రూ.22,182 కోట్లు తగ్గి రూ.7.10 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ప్రాధాన్య రంగం రుణ లక్ష్యాల్లో 30.74 శాతం చేరుకోగా రూ.42,783 కోట్ల రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.22,298 కోట్లు, ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా రూ.1097 కోట్ల రుణాలను అందజేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలు 1.04 కోట్లు కాగా వీటిలో 86.69 లక్షలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా రూ.8883 కోట్లు లబ్ధిదారులకు చెల్లించినట్లు వివరించారు.

 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts