రూ.5,55,55,555ల మహాలక్ష్మి!

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5,55,55,555 విలువైన కరెన్సీతో అలంకరించారు.

Updated : 01 Oct 2022 08:19 IST

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5,55,55,555 విలువైన కరెన్సీతో అలంకరించారు. తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వాసవీమాత గర్భగుడిని, ఆలయ ప్రాంగణాన్నీ కరెన్సీ నోట్లు, నాణేలతో తీర్చిదిద్దారు.


న్యూస్‌టుడే, బెల్లంపల్లి పట్టణం : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య, యువజన సంఘాల ఆధ్వర్యంలో రూ.51 లక్షలతో అమ్మవారిని ‘మహాలక్ష్మి’ రూపంలో అలంకరించారు. 30 మంది దాదాపు 18 గంటలపాటు శ్రమించి కరెన్సీ నోట్లను కుచ్చులుగా చూడముచ్చటగా అలంకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని