కుంగిన సాగర్‌ ఎడమ కాల్వ లైనింగ్‌

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద సెప్టెంబరు 7న ఎడమ కాల్వ కట్ట తెగిపోయిన ఘటన మరువకముందే మరోచోట కాల్వ సిమెంట్‌ లైనింగ్‌ కుంగడం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది.

Published : 02 Oct 2022 02:30 IST

ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు

హాలియా, నిడమనూరు, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద సెప్టెంబరు 7న ఎడమ కాల్వ కట్ట తెగిపోయిన ఘటన మరువకముందే మరోచోట కాల్వ సిమెంట్‌ లైనింగ్‌ కుంగడం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. హాలియా పట్టణ పరిధిలో అయిదు రోజుల కిందట 16.800 కిలోమీటరు వద్ద కాల్వ సిమెంట్‌ లైనింగ్‌ సుమారు 50 మీటర్ల మేర పూర్తిగా కాల్వలోకి జారింది. అధికారులు పరిశీలించి లైనింగ్‌ కుంగిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేయించారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతంతో పాటు పక్కనే మరో 30 మీటర్ల మేర లైనింగ్‌ కాల్వలోకి జారింది. దీనిపై ఎన్నెస్పీ డీఈ సంపత్‌ను వివరణ కోరగా.. ఇటీవలే అక్కడ ఇసుక బస్తాలు వేయించామని, లైనింగ్‌ కుంగడం వల్ల ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని తెలిపారు. ఎండాకాలంలో తగిన మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు.

చాలాచోట్ల ఇదే స్థితి..
సాగర్‌ ఎడమ కాల్వ లైనింగ్‌ చాలా చోట్ల దెబ్బతింది. అసలు లైనింగ్‌ లేనిచోట కట్ట కోతకు గురైంది. ఎడమ కాల్వ ప్రారంభమైన ప్రదేశం నుంచి అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల్లో కాల్వ తీవ్రస్థాయిలో దెబ్బతిన్నా.. అధికారులు మాత్రం ఏమీ కాదనే చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts