రాష్ట్రంలో తొలిసారి సహకార సంఘం గృహ రుణం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాష్ట్రంలోనే మొదటిసారిగా ఓ వ్యక్తికి గృహ రుణం అందజేసింది.

Published : 02 Oct 2022 04:30 IST

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాష్ట్రంలోనే మొదటిసారిగా ఓ వ్యక్తికి గృహ రుణం అందజేసింది. దీంతో పాటు కర్షకమిత్ర(పంట, దీర్ఘకాలిక రుణాలు సక్రమంగా చెల్లించేవారికి) రుణాన్ని కూడా మొదటిసారి అందజేశారు. సహకార సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రం, వ్యాపార సముదాయం శనివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు (టెస్కాబ్‌) అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన అంజయ్య అనే రైతు గృహ నిర్మాణం కోసం సహకార సంఘం ఆధ్వర్యంలో రుణానికి సంబంధించిన రూ.25 లక్షల చెక్కును అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని