యాదాద్రి ప్లాంటును సందర్శించిన సీఎండీలు

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటు (వైటీపీపీ)ను శనివారం టీఎస్‌ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుతో కలిసి కేంద్ర విద్యుత్తు ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ) సీఎండీ రవీందర్‌సింగ్‌, కేంద్ర గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) సీఎండీ వివేక్‌కుమార్‌ దేవంగన్‌ సందర్శించారు.

Updated : 02 Oct 2022 05:47 IST

దామరచర్ల, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటు (వైటీపీపీ)ను శనివారం టీఎస్‌ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుతో కలిసి కేంద్ర విద్యుత్తు ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ) సీఎండీ రవీందర్‌సింగ్‌, కేంద్ర గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) సీఎండీ వివేక్‌కుమార్‌ దేవంగన్‌ సందర్శించారు. అందులో జరుగుతున్న పనులను పరిశీలించి పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం టీఎస్‌ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో సమీక్షించి గడువులోగా పనులు పూర్తికాకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. కొవిడ్‌, అనుమతుల్లో జాప్యం వల్ల ఆలస్యమైనట్లు అధికారులు వారికి వివరించారు. ఇక్కడ సమారు రూ.29 వేల కోట్ల అంచనాతో చేపట్టిన విద్యుత్‌ ప్లాంటు ప్రధాన పనులను బీహెచ్‌ఈఎల్‌కు టీఎస్‌ జెన్‌కో అప్పగించింది. ఈ ప్లాంటుకు 8 వేల కోట్ల రుణాన్ని నామమాత్ర వడ్డీతో ఇచ్చేందుకు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ సంస్థలతో ప్రారంభంలో ఒప్పందం కుదిరింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరం నెలకొనడంతో రుణం సకాలంలో విడుదలవ లేదు. నిధుల కొరత కారణంగా టీఎస్‌ జెన్‌కో సుమారు రూ.900 కోట్లకు పైగా బకాయిలను గుత్తేదారులకు చెల్లించాల్సి ఉండగా.. ఈ ప్రభావం పనులపై పడింది. ఈ నేపథ్యంలో రెండు సంస్థల సీఎండీలు పవర్‌ ప్లాంటును సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని