గాంధీ జీవితం అన్ని కాలాల్లోనూ ఆదర్శప్రాయం

హక్కుల సాధన కోసం ముందు ప్రార్థించడం, అభ్యర్థించడం, ఆ తరువాత నిరసన ప్రకటించి ఉద్యమించడం అనే పంథా ద్వారా దేశ ప్రజలను స్వాతంత్రోద్యమంలో కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత్మాగాంధీ జీవితం అన్ని కాలాల్లోనూ ఆదర్శప్రాయమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 02 Oct 2022 05:43 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హక్కుల సాధన కోసం ముందు ప్రార్థించడం, అభ్యర్థించడం, ఆ తరువాత నిరసన ప్రకటించి ఉద్యమించడం అనే పంథా ద్వారా దేశ ప్రజలను స్వాతంత్రోద్యమంలో కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత్మాగాంధీ జీవితం అన్ని కాలాల్లోనూ ఆదర్శప్రాయమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆయన స్ఫూర్తితో శాంతియుత మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ప్రగతిపథంలో నడుపుతున్నామని పేర్కొన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘‘స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారు. ఆ బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయి. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు ఆయన. అంతిమ విజయం సత్యానిదే అని చాటి చెప్పారు. గుంపులో ఒకరిగా ఉండటం తేలికే కానీ, ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి అన్న గాంధీ మాటలే ప్రేరణగా తెలంగాణ రాష్ట్రం హక్కుల సాధనకోసం ముందడుగు వేస్తోంది’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని