సమాజాన్ని ప్రభావితం చేయడంలో సినిమా కీలకం

సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసే మాధ్యమాల్లో సినిమా చాలా ముఖ్యమైందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంక్యనాయుడు అన్నారు. బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో

Updated : 02 Oct 2022 05:37 IST

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసే మాధ్యమాల్లో సినిమా చాలా ముఖ్యమైందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంక్యనాయుడు అన్నారు. బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో శనివారం రాత్రి అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ఛాయాచిత్రమాలిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదటి ప్రతిని నటుడు చిరంజీవికి వెంకయ్యనాయుడు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన సంప్రదాయాలను, పద్ధతులను సినిమాల ద్వారా మరింత ప్రచారం చేస్తే జనాల్లోకి విస్తృతంగా వెళ్తాయన్నారు. సినీరంగంలో విలువలు, ఉన్నత ప్రమాణాలను నిలబెట్టిన వారిలో అల్లు రామలింగయ్య అగ్రగణ్యులని చెప్పారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య స్మారక పురస్కారాలను నటులు కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌, అలీ, సునీల్‌, ఎల్‌బీ శ్రీరామ్‌, రావు రమేశ్‌, పృథ్వీరాజ్‌, వెన్నెల కిశోర్‌లకు అందజేశారు. కార్యక్రమంలో అల్లు అరవింద్‌, రామ్‌చరణ్‌, ఉపాసన, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌తేజ్‌, అల్లు శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని