Adilabad: కాళ్లు కడిగి.. భోజనం చేసి.. పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నేతల ఆత్మీయ సత్కారం
ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవ పక్వాడా పేరిట భాజపా శ్రేణులు పక్షం రోజులుగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. శనివారం ఆదిలాబాద్ పురపాలక సంఘంలోని సఫాయి కార్మికులకు ఆత్మీయ సన్మానం చేశారు.
ఆదిలాబాద్ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవ పక్వాడా పేరిట భాజపా శ్రేణులు పక్షం రోజులుగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. శనివారం ఆదిలాబాద్ పురపాలక సంఘంలోని సఫాయి కార్మికులకు ఆత్మీయ సన్మానం చేశారు. ఎంపీ సోయం బాపురావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కార్మికుల కాళ్లు కడిగి వారికి నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. ఎంపీ మాట్లాడుతూ సమాజం కాలుష్యరహితంగా ఉందంటే అది కార్మికుల పుణ్యమేనన్నారు. వారి సేవలను గుర్తించి దేశ ప్రధాని తన జన్మదినాన సఫాయి కార్మికులను సన్మానించారని...అదే స్ఫూర్తితో తామీ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. అనంతరం నేతలందరూ కార్మికులతో కలిసి భోజనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kharge: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అది భాజపా గారడీనే: ఖర్గే
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Janasena: తెదేపాతో కలిసి సమస్యలపై పోరాడాలి: నాదెండ్ల మనోహర్
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు