కిందిస్థాయి వారితో సత్సంబంధాలుండాలి

నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు కింది స్థాయి అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉండాలని, తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Updated : 02 Oct 2022 05:33 IST

ఐఎస్‌బీ పీజీపీ మ్యాక్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో గవర్నర్‌ తమిళిసై

రాయదుర్గం, న్యూస్‌టుడే: నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు కింది స్థాయి అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉండాలని, తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గవర్నర్‌ తమిళిసై అన్నారు. శనివారం హైదరాబాద్‌ గచ్చిబౌలి ఐఎస్‌బీలో నిర్వహించిన ‘పీజీపీ మ్యాక్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ 2022’కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. తాను తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినపుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సవాళ్లుంటాయి.. బాధ్యతలు నిర్వర్తించలేవని విమర్శకులు నిరుత్సాహపరిచినా వారికి సమాధానమిచ్చి ముందుకే సాగానని తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌గా మూడేళ్ల కాలం విజయవంతంగా పూర్తి చేశానన్నారు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించగలమని అన్నారు. ఐఎస్‌బీలో బలమైన పూర్వ విద్యార్థుల వ్యవస్థ ఉందని, తాను కులపతిగా విశ్వవిద్యాలయాల్లో పూర్వ విద్యార్థులుగా నమోదు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా 40 ఏళ్ల క్రితం చదువులు పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పూర్వ విద్యార్థులు విద్యా సంస్థలకు ఎంతో సహకారమందిస్తారన్నారు. వ్యాపార లావాదేవీల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని.. కరెన్సీలాగానే కేలరీలనూ నిత్యం లెక్కబెడుతూ ఉండాలని చమత్కరించారు. సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని గవర్నర్‌ సూచించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని