Prakash Raj: విజన్‌ ఉన్న నేత కేసీఆర్‌: ప్రకాశ్‌రాజ్‌

తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్‌ దేశంలో గొప్పనాయకుడని, విజన్‌ ఉన్న వ్యక్తి అని, రాష్ట్రంపై ప్రేమ ఉన్న నేత అని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ కొనియాడారు.

Updated : 02 Oct 2022 08:51 IST

ఈనాడు, కరీంనగర్‌: తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్‌ దేశంలో గొప్పనాయకుడని, విజన్‌ ఉన్న వ్యక్తి అని, రాష్ట్రంపై ప్రేమ ఉన్న నేత అని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ కొనియాడారు. శనివారం రాత్రి కరీంనగర్‌లో నిర్వహించిన కళోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి.. జానపద కళాకారులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన ఆటపాటలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, ప్రతి ఒక్కరి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. అలాంటి నాయకుడు దొరకడం అదృష్టమన్నారు. తెలంగాణను ఎంతగా గౌరవిస్తారనేది ఆయనతో సన్నిహితంగా ఉన్న సందర్భంలో తెలిసిందని చెప్పారు. మతోన్మాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణను మార్చారని ప్రశంసించారు. హరితహారం కార్యక్రమంలాగే భవిష్యత్తులో తెలంగాణ కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్వాభిమానం, మనల్ని మనం గౌరవించుకునే వాతావరణం ఏర్పడిందన్నారు. గతంలో తెలంగాణ భాషను, యాసను సినిమాల్లో హాస్య నటులకే వాడేవారని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ భాష అంటే ఏంటో అందరికీ తెలుస్తోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని