వృద్ధులకు త్వరలో డే కేర్‌ కేంద్రాలు

వయసు పైబడిన దశలో ఒంటరి బతుకు నరకప్రాయమని.. సంతానం, సమాజ నిరాదరణకు గురైన వయోధికులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వృద్దుల కోసం అన్ని జిల్లాల్లో  ఆశ్రమాలు, పగటిపూట సంరక్షణ కేంద్రాల(డే కేర్‌ సెంటర్ల) ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Published : 02 Oct 2022 04:35 IST

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: వయసు పైబడిన దశలో ఒంటరి బతుకు నరకప్రాయమని.. సంతానం, సమాజ నిరాదరణకు గురైన వయోధికులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వృద్దుల కోసం అన్ని జిల్లాల్లో  ఆశ్రమాలు, పగటిపూట సంరక్షణ కేంద్రాల(డే కేర్‌ సెంటర్ల) ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయి ఉత్సవాలను శనివారం రవీంద్రభారతిలో  నిర్వహించారు.  తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు చేజిక్కించుకున్నాక పిల్లలు వారిని వదిలించుకోవాలని చూస్తే.. శాఖాపరంగా ఆస్తులను తల్లిదండ్రులు వెనక్కి తీసుకునేలా చట్టంలో సంస్కరణలకు ప్రతిపాదిస్తామన్నారు.

హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. వయోధికులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతానని అన్నారు. అనంతరం వయోధికుల హెల్ప్‌లైన్‌ నంబరు 14567కు సంబంధించిన గోడపత్రిక, ప్రత్యేక సంచికను మంత్రులు ఆవిష్కరించారు. దివ్యాంగులు, వయోధికుల సంక్షేమ శాఖ సంచాలకురాలు బి.శైలజ, వయోధికుల కౌన్సిల్‌ ప్రతినిధులు నాగేశ్వరరావు, మోహన్‌రెడ్డి, నర్సింహారావు, రజాముహమ్మద్‌, వాచస్పతి దక్షిణమూర్తి పాల్గొన్నారు.

14567కు ఫోన్‌ చేయండి..
దేశవ్యాప్తంగా గతేడాది గణాంకాల ప్రకారం 13.75 కోట్ల మంది వయోధికులు ఉండగా వారిలో సగం మంది పిల్లలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. వీరికి సాయంగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టోల్‌ఫ్రీ నంబరు 14567కు ఫోన్‌ చేసి సాయం అడిగితే వైద్యారోగ్యశాఖ ద్వారా వారికి సేవలందేలా చేస్తారు. పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వారి వివరాలను పోలీసులు, అధికారులకు ఇస్తారు... వారికి ఉచితంగా న్యాయసేవ అందిస్తారు. దీనికోసం ప్రతి జిల్లాకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ఈ సేవలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ జిల్లా వయోధికుల సంక్షేమ కమిటీ సభ్యుడు, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథి సూచించారు. మరోవైపు హైదరాబాద్‌ పోలీసులు వయోధికుల సంఘాలు, ప్రతినిధులకు హాక్‌ఐ మొబైల్‌ యాప్‌ ద్వారా వారు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పిస్తున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని