మంత్రి హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారం సహించం

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమం, ఏపీలో ఉద్యోగుల ఇబ్బందుల గురించి మాట్లాడితే.. ఏపీ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వితండవాదం చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ టీఎన్జీవో, టీజీవో సంఘాలు పేర్కొన్నాయి.

Published : 02 Oct 2022 05:12 IST

ఏపీ మంత్రులు, ఉద్యోగ సంఘం నేతలది వితండవాదం

టీఎన్జీవో, టీజీవో నేతల విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమం, ఏపీలో ఉద్యోగుల ఇబ్బందుల గురించి మాట్లాడితే.. ఏపీ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వితండవాదం చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ టీఎన్జీవో, టీజీవో సంఘాలు పేర్కొన్నాయి. ఈ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, మమత, రాయకంటి ప్రతాప్‌, సత్యనారాయణ, టీఎన్జీవో సహాధ్యక్షుడు కస్తూరి వెంకట్‌లు శనివారం విలేకరులతో మాట్లాడారు. హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని, తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ‘తెలంగాణలో ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లలో 73% ఫిట్‌మెంట్‌ లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 66% మాత్రమే (43+23) ఇచ్చింది వాస్తవం. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ఉద్యోగులు అధిక వేతనాలు పొందుతున్నారు. తెలంగాణ సర్కారు ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తోంది. నగదురహిత ఆరోగ్య సేవలందిస్తోంది. కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారా స్థానికులకే 95% ఉద్యోగాలు దక్కేలా నియామకాలు చేపట్టింది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు తమ అంతర్గత సమస్యలు పరిష్కరించుకోకుండా తెలంగాణను నిందించే యత్నాలను సహించేది లేదు’ అని ఆ నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని