Internet: త్వరలో అంతరిక్షం నుంచి అంతర్జాల సేవలు

అంతరిక్షం నుంచి అంతర్జాల సేవలు త్వరలో భారత్‌లో అందుబాటులోకి వస్తాయని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ చౌహాన్‌ తెలిపారు.

Updated : 02 Oct 2022 08:28 IST

ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌చౌహాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంతరిక్షం నుంచి అంతర్జాల సేవలు త్వరలో భారత్‌లో అందుబాటులోకి వస్తాయని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ చౌహాన్‌ తెలిపారు. డాక్టర్‌ కె.వి.రావు సైంటిఫిక్‌ సొసైటీ 22వ వార్షిక సైన్స్‌ అవార్డులు, స్మారక వేడుకను శనివారం జూమ్‌ ద్వారా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ఉపరితలంపై 50×50 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న వస్తువులను సైతం ఉపగ్రహాల ద్వారా 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి స్పష్టంగా గుర్తించే సామర్థ్యం మనకు ఉందన్నారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ రత్న, అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని