లింగాయత్‌ల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన

సాగు, తాగు నీరు.. రోడ్లు, విద్యుత్‌ వంటి అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. కోకాపేటలో రూ.10 కోట్లతో చేపట్టనున్న లింగాయత్‌ల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు మహమూద్‌ ఆలీ, సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి హరీశ్‌రావు ఆదివారం శంకుస్థాపన చేశారు.

Published : 03 Oct 2022 04:34 IST

వీరిని ఓబీసీలో చేర్చేందుకు కిషన్‌రెడ్డి కృషిచేయాలి: హరీశ్‌రావు

నార్సింగి న్యూస్‌టుడే: సాగు, తాగు నీరు.. రోడ్లు, విద్యుత్‌ వంటి అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. కోకాపేటలో రూ.10 కోట్లతో చేపట్టనున్న లింగాయత్‌ల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు మహమూద్‌ ఆలీ, సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి హరీశ్‌రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్ల కోసం లింగాయత్‌లు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందేనన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలన్నారు. ఎంపీ బీబీ పాటిల్‌ సీఎంకు విజ్ఞప్తి చేసిన వెంటనే ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంతో పాటు బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, నరేందర్‌రెడ్డి, హనుమంతు షిండే పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని