భారత క్రికెట్‌ జట్టులో తెలంగాణ ప్రాతినిధ్యం పెరగాలి

భారత జట్టులో తెలంగాణ ప్రాతినిధ్యం పెరిగేలా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కృషి చేయాలని రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటగాళ్ల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు 33 జిల్లాల్లో  జిల్లా స్థాయి క్రికెట్‌ క్రీడా అభివృద్ధి కమిటీలను నియమించాలని, పోటీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

Published : 03 Oct 2022 04:34 IST

 హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత జట్టులో తెలంగాణ ప్రాతినిధ్యం పెరిగేలా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కృషి చేయాలని రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటగాళ్ల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు 33 జిల్లాల్లో  జిల్లా స్థాయి క్రికెట్‌ క్రీడా అభివృద్ధి కమిటీలను నియమించాలని, పోటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. నైపుణ్యం వున్న క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లలో అవకాశాలు కల్పించాలన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, ఇతర ప్రతినిధులు ఆదివారం మంత్రితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో క్రికెట్‌ అభివృద్ధిపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో క్రీడలకు పెద్దపీట వేశాం. ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం.  క్రీడాభివృద్ధిలో హెచ్‌సీఏ భాగస్వామిగా ఉండాలి’’ అని మంత్రి సూచించారు. అజహరుద్దీన్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలకు సహకరిస్తామన్నారు. ప్రభుత్వం భూమిని కేటాయిస్తే, మహబూబ్‌నగర్‌లో అంతర్జాతీయస్థాయిలో క్రికెట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని