వర్సిటీలు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా ఎదగాలి

దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా ఎదగాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (డీడీజీ) డాక్టర్‌ ఆర్‌.సి.అగర్వాల్‌ ఆకాంక్షించారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి వీలుగా ఇప్పటికే నూతన సిలబస్‌ను సిద్ధం చేశామని వివరించారు.

Published : 03 Oct 2022 04:34 IST

ఐసీఏఆర్‌ డీడీజీ అగర్వాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా ఎదగాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (డీడీజీ) డాక్టర్‌ ఆర్‌.సి.అగర్వాల్‌ ఆకాంక్షించారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి వీలుగా ఇప్పటికే నూతన సిలబస్‌ను సిద్ధం చేశామని వివరించారు. హైదరాబాద్‌ సమీపంలోని కన్హ శాంతి వనంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల వీసీల సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సమావేశంలో డాక్టర్‌ ఆర్‌.సి.అగర్వాల్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల విశ్వవిద్యాలయాలు  ప్రతిభ కలిగిన విద్యార్థులను ఆకర్షించే కేంద్రాలుగా మారాలని సూచించారు. వ్యవసాయ విద్యలో మూడు వారాల నిడివి కల యోగా, ధ్యానం ఫౌండేషన్‌ కోర్సు, ప్రకృతి వ్యవసాయం, పరిశోధనలకు సంబంధించి ప్రత్యేక డిగ్రీ కోర్సుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా హార్ట్‌ ఫుల్‌నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌, ఐసీఏఆర్‌ల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సమావేశంలో కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ బి.నీరజాప్రభాకర్‌తోపాటు సమావేశానికి హాజరైన 46 వర్సిటీల వీసీలు, వారి సతీమణులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. వీసీ డాక్టర్‌ బి.నీరజాప్రభాకర్‌ వారికి బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు