పల్లెబాట పట్టిన నగరం

దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరం నుంచి పల్లె బాట పట్టారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులుతీరాయి. శనివారం ఒక్క రోజే 46 వేల వాహనాలు పంతంగి టోల్‌ ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి.

Published : 03 Oct 2022 04:34 IST

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరం నుంచి పల్లె బాట పట్టారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులుతీరాయి. శనివారం ఒక్క రోజే 46 వేల వాహనాలు పంతంగి టోల్‌ ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి. వారాంతాల్లో సుమారు 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పండగ నేపథ్యంలో శనివారం 11 వేల    వాహనాలు అధికంగా వెళ్లాయి. ఆదివారమూ రద్దీ కొనసాగింది. చౌటుప్పల్‌ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ విధానాన్ని అమలుచేస్తుండటంతో పాటు జీఎమ్మార్‌ గుత్తేదారు సంస్థ అదనపు ఏర్పాట్లు చేయడంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని