TSRTC: ఇక ఆర్టీసీ బ్రాండ్‌ తాగునీరు.. మార్కెట్‌లోనూ విక్రయాలకు యోచన!

ప్రయాణికుల సేవలతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయం దిశగా.. తెలంగాణ ఆర్టీసీ చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తుండగా.. త్వరలో సీసాలతో మంచినీటి (వాటర్‌ బాటిళ్లు) విక్రయాలకూ రంగం సిద్ధం చేస్తోంది.

Updated : 04 Oct 2022 07:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల సేవలతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయం దిశగా.. తెలంగాణ ఆర్టీసీ చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తుండగా.. త్వరలో సీసాలతో మంచినీటి (వాటర్‌ బాటిళ్లు) విక్రయాలకూ రంగం సిద్ధం చేస్తోంది. సొంత బ్రాండ్‌ పేరిట ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించేందుకు గత వారంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆమోదముద్ర పడింది. అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ప్రముఖ కంపెనీల ద్వారా మంచినీటి బాటిళ్లను తయారు చేయించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మీదట సొంత బ్రాండ్‌ నీటినే ఇచ్చేందుకు నిర్ణయించింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని