మైదానం కాదు చెరువే..!

ఓ మైదానంలో పసుపు ఎండబోసినట్టు ఆహ్లాదంగా కనిపిస్తోంది కదూ.. కానీ ఇది ఓ చెరువు. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి చెరువు 120 ఎకరాల్లో విస్తరించి ఉండగా అందులో సుమారు 80 ఎకరాలకుపైగా జెయింట్‌ సాల్వినియా అనే మొక్క ఆక్రమించింది.

Published : 04 Oct 2022 04:25 IST

ఓ మైదానంలో పసుపు ఎండబోసినట్టు ఆహ్లాదంగా కనిపిస్తోంది కదూ.. కానీ ఇది ఓ చెరువు. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి చెరువు 120 ఎకరాల్లో విస్తరించి ఉండగా అందులో సుమారు 80 ఎకరాలకుపైగా జెయింట్‌ సాల్వినియా అనే మొక్క ఆక్రమించింది. పొలాలకు సాగునీరు, పశువుల దాహార్తి, చేప పిల్లల పెంపకం ఇలా అన్నింటికి ఈ చెరువే ఆధారం కావడంతో గతేడాది రూ.5 లక్షలు ఖర్చుచేసి శుభ్రపరిచినా ఫలితం లేకపోయింది. మళ్లీ పెరిగి ఇలా విస్తరించింది. దీంతో చేపల పెంపకానికి అవరోధంగా మారింది. మరోవైపు చిన్నారులు, పశువులు ఈ చెరువులో దిగితే కనిపించకుండా పోయే ప్రమాదం ఉందంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ మొక్క గుర్రపు డెక్క జాతికంటే ప్రమాదకరమైందని, ఇది అరుదుగా కనిపిస్తుందన్నారు. ఇంత ఉద్ధృతి ఎక్కడా కనిపించలేదని, మొదటి దశలోనే నిర్మూలించకపోతే జిల్లాలోని అన్ని చెరువులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే, తాంసి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని