జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్‌ 11 నుంచి

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి, రాష్ట్రంలో సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Updated : 04 Oct 2022 05:40 IST

17 నుంచి రాష్ట్రంలో.. 

షెడ్యూల్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి, రాష్ట్రంలో సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబరు 15 నుంచి తొలి ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభం కావాలని సూచించింది.

అఖిల భారత కోటాలో..

* తొలివిడత ప్రవేశాల ప్రక్రియ: ఈ నెల 11 నుంచి 20 వరకు

* సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో

* చేరడానికి గడువు: ఈ నెల 22- 28 

* రెండో విడత ప్రవేశాలు: నవంబరు 2-10

* కళాశాలల్లో చేరాల్సిన గడువు: నవంబరు 12-18

* మాప్‌అప్‌ రౌండ్‌: నవంబరు 23- డిసెంబరు 1 

* సీట్లు పొందిన అభ్యర్థులు చేరాల్సిన గడువు: డిసెంబరు 4-10 

* సీట్లు మిగిలితే వాటిని రాష్ట్రాలకు బదిలీ చేస్తారు

రాష్ట్రస్థాయిలో..

* తొలి విడత కౌన్సెలింగ్‌: ఈ నెల 17 నుంచి 28 వరకు

* విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సిన గడువు: నవంబరు 4

* రెండోవిడత కౌన్సెలింగ్‌: నవంబరు 7- 18

* విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సిన గడువు: నవంబరు 21

* మాప్‌అప్‌ రౌండ్‌: డిసెంబరు 6- 12

* సీట్లు పొందిన వారు కళాశాలల్లో చేరాల్సిన గడువు: డిసెంబరు 16

* అన్ని విడతల ప్రవేశాలను డిసెంబరు 20లోపు పూర్తి చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ స్పష్టం చేసింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts