ఆదాయ బాటలో ఆర్టీసీ!

తెలంగాణ ఆర్టీసీ గాడిలో పడుతోంది. ప్రయాణికుల సంఖ్య పెద్దగా పెరగకున్నా ఆదాయం మాత్రం క్రమంగా పెరుగుతోంది.

Published : 05 Oct 2022 04:57 IST

లాభాల్లోకి 20 డిపోలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ గాడిలో పడుతోంది. ప్రయాణికుల సంఖ్య పెద్దగా పెరగకున్నా ఆదాయం మాత్రం క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెంచిన వివిధ రకాల సెస్సులు, పన్నులు దీనికి కారణంగా భావిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు చేస్తున్న కసరత్తు కార్యరూపంలోకి వస్తే ఆర్థిక స్థితి మరింతగా మెరుగపడే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో 20 డిపోల వరకు లాభాలను ప్రకటించాయి.  అద్దె బస్సుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణను అమలు చేసి ఖర్చులను తగ్గించుకునే పనిలో అధికారులున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై గడిచిన ఏడాది నుంచి ఆర్టీసీ విస్తృత కసరత్తు చేస్తోంది. కార్గో విధానంలో మార్పులు చేసింది. మొత్తంగా  మునుపటితో పోలిస్తే ఆదాయ పరిస్థితి కొంత మెరుగుపడుతోందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని