వైద్య పోస్టుల భర్తీ ప్రకటన తాత్కాలిక వాయిదా!

స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల నియామక ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 05 Oct 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల నియామక ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన నేపథ్యంలో.. తదనుగుణంగా మార్పులు చేయాల్సి రావడమే కారణమని వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే నియామక ప్రకటన విడుదల చేసిన 969 ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, జనరల్‌ డ్యూటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నాయి. వచ్చే వారం ఈ పోస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కంటే ముందే ఈ నియామక ప్రకటన వెలువడినందున ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తోంది. వీటితోపాటు 1,147 స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ఏర్పాట్లు చేసింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో నోటిఫికేషన్‌ జారీ ఆలస్యం కానుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts