తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిపథంలో నడవాలి

అనతికాలంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ.. పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని  ఆకాంక్షించారు.

Updated : 05 Oct 2022 05:48 IST

దసరా శుభాకాంక్షల సందేశంలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అనతికాలంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ.. పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని  ఆకాంక్షించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించాలన్నారు. ‘‘దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసి.. జమ్మిఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటూ, అలయ్‌ బలయ్‌ తీసుకొంటూ ప్రేమాభిమానాలు చాటుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. విజయానికి సంకేతమైన దసరా నాడు రాష్ట్ర ప్రజలు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్‌ శుభాకాంక్షలు

గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి ఈ పండుగ సంకేతమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని