ప్రవేశాల్లేని సెక్షన్లలో కొత్త డిగ్రీ కోర్సులు

రాష్ట్రంలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 15 సీట్లు లోపు భర్తీ అయిన సెక్షన్లను స్తంభింపజేసిన ఉన్నత విద్యామండలి వాటి స్థానంలో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

Updated : 05 Oct 2022 05:56 IST

వచ్చే ఏడాది అనుమతి ఇవ్వనున్న ఉన్నత విద్యామండలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 15 సీట్లు లోపు భర్తీ అయిన సెక్షన్లను స్తంభింపజేసిన ఉన్నత విద్యామండలి వాటి స్థానంలో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అక్కడ కోర్సుల మార్పునకు అనుమతినిస్తారు. దోస్త్‌ మూడో విడతలో ఒక సెక్షన్‌లో 15 మంది లోపు చేరితే వాటిని వెబ్‌సైట్‌లో బ్లాక్‌ చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 800 కళాశాలల్లో దాదాపు లక్ష సీట్లు కనుమరగయ్యాయి. ప్రస్తుతం దోస్త్‌ మూడో విడత కూడా ముగిసినందున వచ్చే ఏడాది (2023-24) బ్లాక్‌ చేసిన సెక్షన్ల స్థానంలో కొత్త కోర్సు కావాలనుకుంటే అనుమతి ఇవ్వనున్నారు. ఒకవేళ అదే డిగ్రీలో కాంబినేషన్‌ కోర్సును తీసుకుంటే ఫీజు లేకుండా అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. బీఏ నుంచి బీకాం, బీకాం నుంచి బీఎస్‌సీ...ఇలా కోర్సులు మారితే మాత్రం కొంత రుసుం వసూలు చేస్తారు.

1.73 లక్షల మంది చేరిక

ఈ విద్యా సంవత్సరం(2022-23) దోస్త్‌ మూడో విడత ముగిసే నాటికి డిగ్రీలో 1.73 లక్షల మంది ప్రవేశాలు పొందారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ఉన్నందున  ఆ సంఖ్య మరికొంత పెరగనుంది. అయినా గత ఏడాది కంటే ప్రవేశాల సంఖ్య కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత రెండేళ్లు ఇంటర్‌లో 100 శాతం మంది పాస్‌ కావడంతో డిగ్రీలో చేరే వారి సంఖ్య 2.30 లక్షలకు చేరిందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని