ఎ.కొండూరుకి పరిశోధన బృందాన్ని పంపాలి

కిడ్నీ సమస్యతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలానికి పరిశోధన బృందాన్ని పంపాలని కేంద్ర వైద్య ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం లేఖ రాశారు.

Published : 07 Oct 2022 05:26 IST

కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఈనాడు, అమరావతి: కిడ్నీ సమస్యతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలానికి పరిశోధన బృందాన్ని పంపాలని కేంద్ర వైద్య ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం లేఖ రాశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కిడ్నీ సమస్యల బారిన పడుతున్నందున భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌) బృందంతో పరిశోధనలు చేయించి సమస్యకు తగు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. పెరిగిన సమస్య తీవ్రత దృష్ట్యా సమగ్ర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts