ప్రసాదం కోసం పాట్లు!

దసరా ఉత్సవాల్లో విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దర్శనం కోసం వచ్చిన భక్తులకు లడ్డూ ప్రసాదాలను అందించడంలో దేవస్థానం అధికారులు విఫలమయ్యారు.

Published : 07 Oct 2022 05:26 IST

దసరా ఉత్సవాల్లో విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దర్శనం కోసం వచ్చిన భక్తులకు లడ్డూ ప్రసాదాలను అందించడంలో దేవస్థానం అధికారులు విఫలమయ్యారు. ప్రసాదం పంపిణీకి ఒకే చోట కౌంటర్లు ఏర్పాటు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. నవరాత్రుల చివరి మూడు రోజులు భవానీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రద్దీని గమనించి ఒక్కో భక్తుడికి 5 లడ్డూలే ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ అర్జున వీధిలో వర్షాన్ని సైతం లెక్క చేయక భక్తులు భారీగా క్యూ కట్టారు. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంతమంది ప్రసాదం లేకుండానే వెనుతిరిగారు.

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని