దుర్గగుడి ప్రాంగణంలో విరిగిపడిన కొమ్మలు

జోరు వానకు గాలి తోడవడంతో దుర్గగుడి ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చెట్టు కొమ్మలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఆ శబ్దానికి భక్తులు భయంతో పరుగులు తీశారు.

Published : 07 Oct 2022 05:26 IST

విజయవాడ(ఇంద్రకీలాద్రి), న్యూస్‌టుడే: జోరు వానకు గాలి తోడవడంతో దుర్గగుడి ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చెట్టు కొమ్మలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఆ శబ్దానికి భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడున్న 10 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో భవానీలు రావడంతో ఉత్సవాలకు ఏర్పాటు చేసిన బందోబస్తును రెండు రోజులు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని