ఓపిక లేదంటున్నా.. ‘ఓపీ’కి పంపారు!

ఆ పెద్దాయనకు 73 ఏళ్లు.. వయోభారం, అనారోగ్యంతో సతమతమవుతున్నారు. అలాంటి వ్యక్తిని ఆదరించి వైద్యం అందించాల్సిన అత్యవసర విభాగం వైద్యులు పడక ఖాళీ లేదని వెనక్కి పంపించారు.

Published : 08 Oct 2022 02:40 IST

వృద్ధుడి గోస పట్టని నిమ్స్‌ ‘ఎమర్జెన్సీ’ వైద్యులు
చక్రాల కుర్చీలోనే పోయిన ప్రాణం

ఈనాడు, హైదరాబాద్‌: ఆ పెద్దాయనకు 73 ఏళ్లు.. వయోభారం, అనారోగ్యంతో సతమతమవుతున్నారు. అలాంటి వ్యక్తిని ఆదరించి వైద్యం అందించాల్సిన అత్యవసర విభాగం వైద్యులు పడక ఖాళీ లేదని వెనక్కి పంపించారు. ఓపీ విభాగంలో వైద్యుల్ని కలిసేందుకు వెళ్లి చక్రాల కుర్చీలోనే కన్నుమూయడం సాటి రోగుల్ని కన్నీరు పెట్టించింది. నల్గొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన మాధవరెడ్డి(73) కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నంలో ఉంటున్నారు. ఆయనకు నిమ్స్‌ ఆసుపత్రిలో మూడేళ్ల క్రితం వైద్యులు స్టెంట్‌ వేశారు. కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండటంతో శుక్రవారం  కుటుంబికులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ విభాగం వైద్యుల్ని కలిసేందుకు వెళ్తే.. అత్యవసర విభాగానికి వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్తే.. పడకలు ఖాళీ లేవని.. ఓపీలోనే సంప్రదించాలని చెప్పారు. దీంతో మళ్లీ ఔట్‌పేషెంట్‌ బ్లాక్‌కి వెళ్లారు. ఓపీ చీటి కోసం సహాయకులు వరుసలో ఉండగా మాధవరెడ్డి చక్రాల కుర్చీలోనే ప్రాణాలొదిలారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని అత్యవసర విభాగం వైద్యులు చేర్చుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆసుపత్రి అత్యవసర విభాగం ఇన్‌ఛార్జి డా.సునీల్‌ వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు.  జరిగిన ఘటనపై విచారణ చేస్తామని తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని