యాదాద్రిలో తలనీలాల టికెట్‌ ధర పెంపు

యాదాద్రి క్షేత్రంలో తల నీలాలు సమర్పించే భక్తులు ఆ మొక్కు తీర్చుకోవాలనుకుంటే ఇక రూ.50 చెల్లించాల్సిందే. ఈ మేరకు దేవస్థానం ఈవో గీత శుక్రవారం పత్రికా ప్రకటన ఇచ్చారు.

Published : 08 Oct 2022 02:40 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి క్షేత్రంలో తల నీలాలు సమర్పించే భక్తులు ఆ మొక్కు తీర్చుకోవాలనుకుంటే ఇక రూ.50 చెల్లించాల్సిందే. ఈ మేరకు దేవస్థానం ఈవో గీత శుక్రవారం పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ టికెట్‌ ధరలోని 60 శాతం సొమ్మును కల్యాణకట్టలోని నాయీబ్రాహ్మణులకు పారితోషికంగా చెల్లించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. గతంలో ఈ టికెట్‌ ధర రూ.20 ఉండేది.

యాదాద్రి దర్శనం తిరుమల తరహాలో కల్పించేందుకు శుక్రవారం ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టారు. కొండపైన ఉచిత దర్శన వరుసల కాంప్లెక్స్‌ నుంచి ఆలయ మాడ వీధి మీదుగా భక్తులను వరుస క్రమంలో తరలించే ప్రక్రియను చేపట్టారు. దర్శనానికి వేచి ఉండే భక్తులతో ఉచిత, ప్రత్యేక వరుసలు నిండిపోయి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సూచనలతో దర్శనం సులువుగా సాగేలా శ్రీకారం చుట్టినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని