Alampur: హుండీలో రూ.100 కోట్ల చెక్కు.. హంబక్కు

అలంపూర్‌ జోగులాంబ ఆలయంలో హుండీ లెక్కింపు జరుగుతోంది. నాణేలను, నోట్లు, కానుకలను సిబ్బంది వేరుచేస్తూ లెక్కిస్తున్నారు. వారికి ఓ చెక్కు కనపడింది.

Updated : 16 Oct 2022 09:31 IST

అలంపూర్‌ జోగులాంబ ఆలయంలో హుండీ లెక్కింపు జరుగుతోంది. నాణేలను, నోట్లు, కానుకలను సిబ్బంది వేరుచేస్తూ లెక్కిస్తున్నారు. వారికి ఓ చెక్కు కనపడింది. దానిపై ‘అక్షరాలా వంద కోట్ల రూపాయలు’ అని రాసి ఉండటంతో వారు ఉలిక్కిపడ్డారు. దాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. దానిపై ఆర్మీ జవాన్ల కోసం అని రాసి ఉంది. ఇంత విరాళమా...? నిజమేనా? ఇచ్చిన వ్యక్తి ఎవరు? అని ఆలయాధికారులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఆ చెక్కు ఏపీజీవీబీ వరంగల్‌ శాఖకు చెందినది కాగా.. వేసిన వ్యక్తి ఖాతాలో రూ.23 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. కొసమెరుపు ఏమిటంటే.. అలంపూర్‌ మండలానికి చెందిన అతనికి మతిస్థిమితం లేదు. ఓ ఘటనకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు అతడిని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో పోలీసులు ఇటీవల చేర్పించారు.

- న్యూస్‌టుడే, అలంపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని