Telangana News: హమాలీ పోస్టు రూ.60.10 లక్షలు!

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ శివారులో ఉన్న స్వదేశీ మద్యం (ఐఎంఎల్‌) డిపోలో హమాలీ పోస్టు ఏకంగా రూ.60.10 లక్షలు పలికినట్లు తెలిసింది. సంబంధిత సంఘం సభ్యులు వేలం వేయగా.. పోటీపడిన నలుగురిలో ఒకరు చేజిక్కించుకున్నారు.

Updated : 17 Oct 2022 08:16 IST

మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలో వేలం

కొల్చారం, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ శివారులో ఉన్న స్వదేశీ మద్యం (ఐఎంఎల్‌) డిపోలో హమాలీ పోస్టు ఏకంగా రూ.60.10 లక్షలు పలికినట్లు తెలిసింది. సంబంధిత సంఘం సభ్యులు వేలం వేయగా.. పోటీపడిన నలుగురిలో ఒకరు చేజిక్కించుకున్నారు. డిపోలో మద్యం సీసాలున్న పెట్టెలను వాహనాల్లోకి ఎక్కించడం, దించడం హమాలీ పని. డిపో మేనేజర్‌ నాగేశ్వరరావును వివరణ కోరగా... అది హమాలీల వ్యక్తిగత విషయమని, వేలం విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని