Outer Ring Road: ఔటర్‌ పక్కన అడవిలో ఏసీ గదులు

రణగొణ ధ్వనులు, వాయు కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు.

Updated : 24 Oct 2022 07:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: ణగొణ ధ్వనులు, వాయు కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. నగరానికి చేరువలోని మస్‌జీద్‌గడ్డ జంగిల్‌ క్యాంప్‌ సరికొత్త హంగులతో సిద్ధం అవుతోంది  ఔటర్‌ రింగ్‌రోడ్డులోని పెద్ద గోల్కొండ కూడలి సమీపంలో ఉందీ 180 హెక్టార్ల పట్టణ అటవీపార్కు. ప్రారంభంలో రాత్రి బసకు గుడారాలు ఏర్పాటుచేశారు. ఇప్పుడు వాటి స్థానంలో ఏసీ సూట్లు నిర్మిస్తున్నారు. ప్రకృతి అందాల్ని చూసేందుకు గదికి ఓవైపు పెద్దపెద్ద అద్దాలను ఏర్పాటుచేస్తున్నారు. మొత్తం ఎనిమిది సూట్లు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి ఈ జంగిల్‌ క్యాంప్‌ కొవిడ్‌కు ముందే ప్రారంభమై సందర్శకులకు అందుబాటులోకి వచ్చినా..కరోనా మహమ్మారి కారణంగా మూసివేశారు. ఏసీ సూట్‌ అద్దె ఎంతన్నది అటవీశాఖ ఇంకా నిర్ణయించలేదు. డిసెంబరులో ఈ అటవీపార్కు ప్రకృతి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు