Yadadri: యాదాద్రిలో బ్రేక్‌ దర్శనాలకు శ్రీకారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో సోమవారం నుంచి బ్రేక్‌ దర్శన సదుపాయాన్ని ప్రారంభించారు. ఇక్కడి ఆలయంలో తిరుమల తరహాలో దర్శనాలకు వీలు కల్పించేందుకు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated : 01 Nov 2022 08:47 IST

రోజూ 2 గంటల పాటు..

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో సోమవారం నుంచి బ్రేక్‌ దర్శన సదుపాయాన్ని ప్రారంభించారు. ఇక్కడి ఆలయంలో తిరుమల తరహాలో దర్శనాలకు వీలు కల్పించేందుకు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు వీవీఐపీ, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రవేశపెట్టారు. నిత్యం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 5 వరకు రెండు గంటల పాటు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈమేరకు కార్తికమాసం తొలి సోమవారం రెండు దఫాల్లో 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారు. వీటిద్వారా రూ.87,600 ఆదాయం సమకూరింది.

కార్తిక తొలి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. 354 జంటలు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నాయి. ఈ వ్రతాల ద్వారా రూ. 2,83,200 ఆదాయం సమకూరింది.

8న ఆలయం మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రిలో ప్రధాన, అనుబంధ, ఉప ఆలయాలను ఈనెల 8న మూసివేస్తారు. ఆరోజు ఉదయం 8.15 గం. నుంచి రాత్రి 8 వరకు ఆలయాల ద్వారబంధనం జరుగుతుందని ఈవో గీత సోమవారం తెలిపారు. కార్తికపౌర్ణమి రోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.37 గంటలకు మొదలై సాయంత్రం 6.19 గంటలకు వీడుతుందని పూజారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని