Hanumakonda: ఆస్తి తీసుకొని.. అమ్మను వదిలేసింది!

ఈ వృద్ధురాలి పేరు గొర్రె మార్త. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌ స్వస్థలం. ఏడాది కాలంగా ఆ ఊరిలోని బస్సు షెల్టర్‌లోనే తలదాచుకుంటున్నారు.

Updated : 03 Nov 2022 08:01 IST

ఈ వృద్ధురాలి పేరు గొర్రె మార్త. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌ స్వస్థలం. ఏడాది కాలంగా ఆ ఊరిలోని బస్సు షెల్టర్‌లోనే తలదాచుకుంటున్నారు. రెండేళ్ల క్రితం భర్త పోచయ్య చనిపోయాక ఒంటరైన ఆమె.. తన యోగక్షేమాలు చూసుకుంటుందని భావించి ఇంటిని, ఉన్న ఒకటిన్నర ఎకరం పొలాన్ని ఒక్కగానొక్క కూతురికి ఇచ్చేశారు. కాజీపేటలో నివాసం ఉంటున్న కుమార్తె.. తల్లి ఇచ్చిన ఇంటిని విక్రయించుకున్నారు.  తర్వాత మార్తను వృద్ధాశ్రమంలో చేర్పించి అటువైపు కన్నెత్తి చూడలేదు.   నెలనెలా డబ్బు ఇవ్వనిదే వృద్ధురాలిని చూడలేమంటూ నిర్వాహకులు తిరిగి ఆమెను సొంతూరికి పంపారు. సొంతూరులో ఇల్లు లేక, కుమార్తె ఆదరించక..  ఇలా బస్సు షెల్టర్‌లో ఉంటున్నారు. సర్కారు ఇచ్చే రూ.2 వేల ఫించనే తనకు ఆధారమని కన్నీటి పర్యంతమవుతూ బుధవారం మార్త తన గోడును  వెళ్లబోసుకున్నారు.

- ఈనాడు, హనుమకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని