Chandra Grahan 2022: గంట 46 నిమిషాల పాటు చంద్రగ్రహణం

ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం మంగళవారం(నేడు) కనిపించనుంది. కొన్ని నగరాల్లో అది సంపూర్ణంగా హైదరాబాద్‌లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది.

Updated : 08 Nov 2022 08:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం మంగళవారం(నేడు) కనిపించనుంది. కొన్ని నగరాల్లో అది సంపూర్ణంగా హైదరాబాద్‌లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40కు ప్రారంభమై 7.26 గంటలకు ముగుస్తుంది. గంట 46 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని జి.పి.బిర్లా ఆర్కియలాజికల్‌ ఆస్ట్రోనామికల్‌ అండ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(జీపీబీఏఏఎస్‌ఆర్‌ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని