Megha Sudha Reddy: గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలాలో ‘మేఘా’ సుధారెడ్డి

మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి.. గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు.

Updated : 23 Nov 2022 09:12 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి.. గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్‌లో తాజాగా జరిగిన ది గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలా ఎడిషన్‌లో ఆమె భారత్‌ తరఫున పాల్గొన్నారు. సంస్థ పోషకుల్లో ఒకరిగా అధికారికంగా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రచారకురాలిగా కొత్త బాధ్యతల కోసం తాను ఎదురు చూస్తున్నానని ప్రకటించారు. గాలాలో ఆమె ప్రత్యేక గౌను ధరించి తనదైన ముద్ర వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు