పాస్‌పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్‌మెంట్ల రీషెడ్యూల్‌

సాంకేతిక కారణాలతో మంగళవారం సేవలు వాయిదా పడిన నేపథ్యంలో ఆ అపాయింట్‌మెంట్లను శనివారానికి మార్చినట్లు రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Published : 25 Nov 2022 03:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక కారణాలతో మంగళవారం సేవలు వాయిదా పడిన నేపథ్యంలో ఆ అపాయింట్‌మెంట్లను శనివారానికి మార్చినట్లు రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయిదు పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు, 14 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఈ నెల 22న సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోయాయి. ఆ రోజు నిలిచిపోయిన అపాయింట్‌మెంట్ల తదుపరి షెడ్యూల్‌ను 26వ తేదీకి మార్చామని ఆర్పీవో దాసరి బాలయ్య పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు ఇప్పటికే సందేశాలు పంపించామని.. అందనివారు స్థానికంగా ఉన్న పాస్‌పోర్టు సేవా కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వారి కోసం ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని