నల్లమలలో రహదారిపై పెద్దపులి సంచారం

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై.. ఫర్హాబాద్‌-వట్వర్లపల్లి మధ్య బుధవారం పెద్దపులి రోడ్డు దాటుతూ ప్రయాణికులకు కనిపించింది.

Published : 25 Nov 2022 04:03 IST

అమ్రాబాద్‌, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై.. ఫర్హాబాద్‌-వట్వర్లపల్లి మధ్య బుధవారం పెద్దపులి రోడ్డు దాటుతూ ప్రయాణికులకు కనిపించింది. వారు సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ఉండే గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులి అటవీ ప్రాంతాల్లో కనిపించినా రహదారిపైకి రావడం అరుదని అటవీశాఖ రేంజర్‌ ప్రభాకర్‌ తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts