మెట్రో మార్గం పైనుంచి తొలి పైవంతెన..

హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మెట్రో రైళ్లు.. పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌ రోడ్ల వద్ద పైవంతెనల పైనుంచి వెళుతూ కనువిందు చేస్తాయి.

Published : 25 Nov 2022 04:03 IST

హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మెట్రో రైళ్లు.. పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌ రోడ్ల వద్ద పైవంతెనల పైనుంచి వెళుతూ కనువిందు చేస్తాయి. త్వరలో మెట్రో రైలు మార్గం పైనుంచి సైతం వాహనాలపై దూసుకెళ్లవచ్చు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మిస్తున్న పై వంతెనతో ఇది సాధ్యం కానుంది. వీఎస్‌టీ- ఇందిరా పార్కు పైవంతెనను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద మెట్రో రైలు మార్గంపై నుంచి వెళ్లేలా నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం మెట్రో రైలు మార్గానికి ఇరువైపులా స్టీల్‌ పిల్లర్ల నిర్మాణం పూర్తయి ఇలా కనిపిస్తున్నాయి.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని